Monday, January 4, 2021

మనకు వచ్చే ప్రతి కలకు ఒక అర్ధం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ కల మనల్ని ఆలోచింపజేస్తుంది.

 మనకు వచ్చే ప్రతి కలకు ఒక అర్ధం ఉంటుంది.


కొన్ని సందర్భాల్లో ఆ కల మనల్ని ఆలోచింపజేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రతి కల ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సంభవిస్తుంది. కొన్నిసార్లైతే... ఒకే కల మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఒక్కోసారి పీడ కలలు వస్తుంటాయి. నిద్ర పట్టకుండా చేస్తాయి. అప్పుడప్పుడూ మనకు వచ్చే కలలు నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. ఆయా సందర్భాల్లో మీకు వచ్చిన కల గుర్తుకొస్తే ఆశ్చర్యం కలగక మానదు. అదేవిధంగా, కొన్ని కలలు మిమ్మల్ని హెచ్చరించడానికి లేదా మీ జీవితంలో ఒక నిర్దిష్ట పరిస్థితిని వివరించడానికి వస్తుంటాయి. అందువల్ల ఏ కలకు ఎలాంటి అర్థం ఉంటుందో తెలుసుకుంటే మంచిదే.


ఉదాహరణకు మీరు ఒక బావిలో పడిపోయినట్లు కల వస్తే అది ఆందోళన కలిగించే కలా?


లేదంటే ఆలోంపజేసే కలా? తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా ఇలాంటి కలలు వచ్చినప్పుడు మొదట మనం ఆందోళన చెందడం సహజం. కాబట్టి మొదట మీ కలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. బావి అనేది లోతైన, చీకటి భూగర్భ జలాశయం. కొన్ని బావుల్లో ఎక్కడానికి మెట్లు ఉంటాయి. మరికొన్ని బావుల్లో ఎలాంటి మెట్లూ ఉండవు. అలాంటి బావిలో ఒక వ్యక్తి అనుకోకుండా పడి సహాయం కోసం పిలిస్తే, బావి లోతు కారణంగా అతని గొంతు బయటి వారికి వినిపించదు. ఒకవేళ ఆ బావి చుట్టూ ఎవరూ లేనట్లయితే, దానిలో పడిపోయిన వ్యక్తి దాని నుంచి బయటపడటం పెద్ద సవాలనే చెప్పాలి.


బావిలో పడిపోవడం అనే కల ఆందోళనకరమైన కలగా పరిగణించవచ్చు. ఈ కలనే మరో రకంగా విశ్లేషిస్తే... మీరు గొప్ప విజయం నుంచి... కిందికి పడిపోయారనే అర్థం కూడా వస్తుంది. ఇలాంటి కల సంభవిస్తే మీ మానసిక స్థితి బాగా లేదని, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాక, మీరు ఆర్థికపరంగా లేదా ఇతర కారణాల చేత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి మీకు ఇతరుల సహాయం అవసరం అవుతుంది.


బావి లోపల ఉన్న చీకటి ప్రాంతం... మీ స్టేట్ ఆఫ్ మైండ్‌ను ప్రతిబింబిస్తుంది. మీకు వచ్చే కలలు మీ కష్టాల తీవ్రతను సూచిస్తాయి. అందువల్ల, మీకు ఎప్పుడైనా ఇలాంటి కల వచ్చినట్లయితే, మీ జీవితంలో ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించుకోండి. మీ ఇబ్బందులు మిమ్మల్ని అధిగమించకుండా ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొనండి. మీ కలతో ఆందోళనకు గురై ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకండి. ఎందుకంటే ఒత్తిడి మీ మనసుకు, శరీరానికి చాలా హాని చేస్తుంది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS