Thursday, March 10, 2022

శివరాత్రి మర్నాడు

శివరాత్రి మర్నాడు




మహాశివరాత్రి రోజు శివ అభిషేకాలు చేసి శివకథలు వింటూ మరొకసారి శివరాత్రి మూడు, నాలుగో జాములో మరోసారి హరతులను సమర్పించాలి.

 సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. 

‘పరమాత్మా! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేశాను. 

హే లోకేశ్వరా! శివ, భవా! నన్ను క్షమించు... ఈ రోజు నేను ఆర్జించిన పుణ్యమంతా, మీకు అర్పించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. 

హే కృపానిధీ! మా పట్ల ప్రసన్నులు కండి! మీ నివాసానికి వెళ్లండి. మీ దర్శనమాత్రం చేతనే మేము పవిత్రులమయ్యాం’ అని వేడుకోవాలి.

శివరాత్రి మర్నాడు శివ భక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి.

 లింగోద్భవం జరిగిన అర్థరాత్రి రోజూ వస్తుంది కాబట్టి ప్రతిరోజూ శివరాత్రే... ప్రతి క్షణం శివస్మరణ యోగ్యమే.

 అయితే కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెలా వచ్చే రోజును మాస శివరాత్రి అన్నారు.

 అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు అత్యంత ప్రీతికరం. అందుకే ఆ రోజున మహా శివరాత్రి పర్వదినంగా జరుపుకుంటారు.

 శివరాత్రి మర్నాడు శివ ప్రాతఃకాలాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. అలా కాకపోతే, ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి.

 ఉపవాస, జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మర్నాడు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలని వ్రత విధానన్ని పార్వతికి ఆది దేవుడు బోధించాడు...🚩🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS